కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన అనంతరం.. పార్టీలో నాయకత్వ సంక్షోభం నెలకొంది. తదుపరి సారథి ఎంపికపై అనేక ఊహాగానాల నేపథ్యంలో నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశమవనుంది. ఈ భేటీలోనే నూతన అధ్యక్షుడిపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముంది.
ముకుల్ వాస్నిక్‌కే అవకాశం..!
నేడు సీడబ్ల్యూసీ సమావేశం నేపథ్యంలో.. పార్టీ సీనియర్ నేతలు యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీతో శుక్రవారం భేటీ అయ్యారు. అహ్మద్ పటేల్, ఏకే ఆంటోనీ, కేసీ వేణుగోపాల్.. పార్టీ అధ్యక్ష పదవి కోసం కొందరి పేర్లు సోనియాకు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ముకుల్ వాస్నిక్, మల్లికార్జున్ ఖర్గే సహా కొందరు యువనేతలు పోటీలో ఉన్నారు. అయితే.. అధ్యక్ష పదవి వాస్నిక్‌కు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. 134 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో.. 2 దశాబ్దాల తర్వాత గాంధీయేతర వ్యక్తి పార్టీ సారథి అయ్యే అవకాశాలున్నాయి.