నేపాల్ సోమవారం మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. బిహార్ పశ్చిమ చంపారన్ జిల్లా వాల్మీకినగర్ గండక్రాజ్ బ్యారేజీకి సమీపంలో సరిహద్దు వెంట రెండు క్యాంప్‌లను ఏర్పాటు చేసింది. బ్యారేజ్ వద్ద ఇప్పటివరకు పోలీసులతో కాపాలా ఏర్పాటుచేసిన నేపాల్.. వచ్చేవారం నుంచి సైన్యాన్ని మోహరించనున్నట్లు తెలుస్తోంది. తుతీబరీ ప్రాంతంలోని సునౌలీ, మహేశ్పుర్ వద్ద పెద్దసంఖ్యలో గుడారాలను నెలకొల్పిందని సమాచారం.
చైనా తుపాకులు..
ఇప్పటివరకు కాలం చెల్లిన తుపాకులను వాడుతున్న నేపాల్ సైన్యానికి చైనా అధునాతన తుపాకులను అందించిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.