తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా ఎఫెక్ట్​: నెహ్రూ బోట్​ రేస్​ రద్దు - Corona effect on Nehru Trophy

కేరళ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నెహ్రూ బోట్​ రేస్​ను కొవిడ్​ సంక్షోభం కారణంగా.. ఈ ఏడాది రద్దు చేస్తున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. 67 ఏళ్ల చరిత్రలో ఈ ట్రోఫీ రద్దవడం ఇదే తొలిసారి.

Nehru Trophy Boat Race called off this yearc
కేరళలో నెహ్రూ బోట్​ రేస్​ రద్దు

By

Published : Aug 7, 2020, 12:15 PM IST

కేరళలోని ప్రముఖ పర్యటక ప్రాంతమైన అలప్పుజాలో ఏటా అట్టహాసంగా జరిగే నెహ్రూ ట్రోఫీ బోట్​ రేస్​ ఈ సంవత్సరం రద్దయింది. ఈ పోటీలు ప్రారంభమయ్యాక 67 ఏళ్లలో రద్దు కావడం ఇదే తొలిసారని స్థానిక పాలనాధికారి, రేస్​ సొసైటీ ఛైర్మన్​ తెలిపారు.

నాటి ప్రధాని పర్యటనతో షురూ..

1952లో అప్పటి ప్రధాని జవహర్​లాల్​ నెహ్రూ కేరళ పర్యటన సందర్భంగా.. ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్నేక్​ బోట్​ రేస్(చుందన్​ వాల్లం కాలీ) నిర్వహించింది. అప్పటినుంచి నెహ్రూ ట్రోఫీ పేరుతో ఏటా ఆగస్టు రెండో శనివారం నాడు.. అలప్పుజాలోని పున్నామాడ సరస్సులో ఈ పోటీలను నిర్వహిస్తోంది కేరళ సర్కారు.

ఏమీటీ బోట్​ రేస్​.?

ఒక్కో టీమ్​లో 64 లేదా 128 మంది చొప్పున రెండు టీమ్​లు రేసులో పాల్గొంటాయి. అలప్పుజాలోని పున్నామాడ సరస్సులో నిర్వహించే ఈ పోటీల్లో.. రేసర్లంతా కలిసి తెడ్డు సాయంతో పడవను నడపాల్సి ఉంటుంది. అట్టహాసంగా జరిగే ఈ రేస్​ను అక్కడి ప్రజలు ఎంతో ఆసక్తిగా తిలకిస్తారు.

ఇదీ చదవండి:సుశాంత్ కేసు పని పట్టే సీబీఐ బృందం ఇదే!

ABOUT THE AUTHOR

...view details