తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా.. కొత్త తేదీలివే.. - JEE-Advanced latest

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోన్న తరుణంలో నీట్​, జేఈఈ​ ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్​కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది కేంద్ర మానవ వనరుల శాఖ. నీట్​ను సెప్టెంబర్​ 13న, జేఈఈ మెయిన్​ను సెప్టెంబర్​ 1 నుంచి 6 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది.

NEET postponed to Sept 13 in view of COVID-19 , JEE-Mains to be held from Sept 1-6: HRD Ministry
నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా.. కొత్త తేదీలివే?

By

Published : Jul 3, 2020, 10:15 PM IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో నీట్‌, జేఈఈ పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ కొత్త తేదీలను ప్రకటించింది. సెప్టెంబర్‌ 1 - 6 తేదీల్లో జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు, సెప్టెంబర్‌ 27న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆ శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌ వెల్లడించారు. అలాగే, సెప్టెంబర్‌ 13న నీట్‌ పరీక్ష నిర్వహించనున్నట్టు ఆయన ట్విటర్‌లో తెలిపారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

వాస్తవానికి గత నెలలో జరగాల్సిన ఈ పరీక్షలు లాక్‌డౌన్‌తో కేంద్రం ఈ నెలకు వాయిదా పడ్డాయి. అయితే, కొవిడ్‌ కేసులు దేశంలో మరింతగా పెరిగిపోతుండటం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని నిపుణుల సూచనల మేరకు పరీక్షలను మరోసారి వాయిదావేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇదీ చదవండి:క్లాస్​కు వెళ్లకుండానే ఐఐటీ నుంచి డిగ్రీ పట్టా!

ABOUT THE AUTHOR

...view details