తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నీట్​' తీర్పు రివ్యూ పిటిషన్​ను పరిశీలించనున్న సుప్రీం - SC to consider plea on neet Exam

నీట్​, జేఈఈ పరీక్షలపై ఆగస్టు 17న ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని ఆరు విపక్ష అధికార రాష్ట్రాల మంత్రులు దాఖలు చేసిన పిటిషన్​ను నేడు పరిశీలించనుంది సుప్రీం కోర్టు. నేరుగా విచారణ చేపట్టే అంశంపై నిర్ణయం తీసుకోనుంది.

NEET
నీట్​, జేఈఈ పరీక్షల రివ్యూ పిటిషన్​ను పరిశీలించనున్న సుప్రీం

By

Published : Sep 4, 2020, 5:14 AM IST

వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్​, ఇంజినీరింగ్​ ప్రవేశ పరీక్ష జేఈఈ నిర్వహణపై ఆగస్టు 17న ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని దాఖలైన పిటిషన్​ను నేడు పరిశీలించనుంది సుప్రీం కోర్టు. విచారణ చేపట్టాలా లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకోనుంది.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని, గత తీర్పును సమీక్షించాలని కోరుతూ.. ఆరు విపక్ష అధికార రాష్ట్రాల మంత్రులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం తీర్పు విద్యార్థుల జీవించే హక్కును హరిస్తోందని.. కరోనా వేళ పరీక్షల నిర్వహణతో వచ్చే ఇబ్బందులను విస్మరిస్తోందని పేర్కొన్నారు.

సుప్రీం ధర్మాసనంలోని న్యాయమూర్తులు జస్టిస్​ అశోక్​ భూషణ్​, జస్టిస్​ బీఆర్​ గవాయ్​, జస్టిస్​ క్రిష్ణ మురారిలు ముందుగా పిటిషన్​ను తమ ఛాంబర్స్​లో పరిశీలిస్తారు. పిటిషనర్లు లేవనెత్తిన అంశాల్లో విచారించాల్సిన విషయాలు ఉన్నాయని తెలితే.. నేరుగా విచారించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ పిటిషన్​ను బంగాల్ నుంచి​ మొలోయ్​ ఘటక్​, ఝార్ఖండ్ నుంచి​ రామేశ్వర్​ ఓరావున్, రాజస్థాన్ నుంచి​ రఘు శర్మ, ఛత్తీస్​గఢ్​ నుంచి అమర్​జీత్​ భగత్​, పంజాబ్ నుంచి​ బీఎస్​ సిద్ధు, మహారాష్ట్ర నుంచి ఉదయ్​ రవీంద్ర సావంత్​లు దాఖలు చేశారు.

నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ (ఎన్​టీఏ) నీట్​, జేఈఈ పరీక్షలను నిర్వహిస్తోంది. జేఈఈ మేయిన్​ పరీక్షలను సెప్టెంబర్​ 1 నుంచి 6 వరకు, నీట్​ పరీక్షలను సెప్టెంబర్​ 13న నిర్వహిస్తోంది.

ఇదీ చూడండి: 'చైనా ఏకపక్ష ధోరణి వల్లే ఈ ఉద్రిక్త పరిస్థితులు'

ABOUT THE AUTHOR

...view details