తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'టీకా పంపిణీకి స్పష్టమైన వ్యూహం అవసరం'

కరోనా వైరస్​ వ్యాక్సిన్​ ప్రజలకు చౌక ధరల్లో విస్తృతంగా అందుబాటులోకి వచ్చేలా చూడాలని ప్రభుత్వానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. ఇందుకు స్పష్టమైన వ్యూహాన్ని అమలు చేయాలన్నారు.

Rahul Gandhi
రాహుల్ గాంధీ

By

Published : Aug 14, 2020, 12:27 PM IST

కరోనా వైరస్​కు వ్యాక్సిన్​ తయారు చేసే సామర్థ్యం భారత్​కు ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ ప్రక్రియకు స్పష్టమైన వ్యూహాం అవసరమని పేర్కొన్నారు. ప్రజలకు వ్యాక్సిన్ చౌకగా అందేలా చూడాలని కేంద్రానికి సూచించారు.

రాహుల్ గాంధీ ట్వీట్

"కరోనాకు వ్యాక్సిన్ తయారు చేసే దేశాల్లో భారత్​ ఒకటి. ప్రజలకు చౌకగా, నిజాయతీగా టీకా సరఫరా జరగాలి. ఇందుకు స్పష్టమైన వ్యూహం అవసరం. దీన్ని భారత ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలి."

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

అంతకుముందు దేశంలో కరోనా పరిస్థితిపై రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్​లో కరోనా పరిస్థితి భయానకంగా ఉందన్నారు.

ఇదీ చూడండి:'దేశంలో కరోనా కేసుల సూచీ భయపెడుతోంది'

ABOUT THE AUTHOR

...view details