దేశవ్యాప్తంగా పేదరికంలో ఉన్న ప్రజలు, నిరుద్యోగులను ఆదుకునేందుకు పట్టణ ప్రాంతాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయడం అత్యవసరమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రతిపాదించిన కనీస ఆదాయ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రెండు పథకాలను అమలు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు సైతం మేలు చేస్తుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. పేదల బాధలను ప్రభుత్వం అర్థం చేసుకుంటుందా అని ప్రశ్నించారు. ఈ మేరకు ఓ గ్రాఫ్‌ను ట్వీట్‌కు జతచేశారు.
"పట్టణాల్లో నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటున్న వారి కోసం మనరేగా పథకం అమలు చేయడం అవసరం. దేశవ్యాప్తంగా ఉన్న పేద ప్రజల కోసం న్యాయ్ పథకాన్ని అమలు చేయాలి. 'సూటు-బూటు-లూట్' ప్రభుత్వం పేదల బాధలను అర్థం చేసుకుంటుందా?"