తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్రప్రభుత్వంలో 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు అవకాశం - jobs in central government

2018 మార్చి 1 నాటికి కేంద్రంలో సుమారు 7 లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈమేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

RSQ-VACANCIES

By

Published : Nov 21, 2019, 4:39 PM IST

కేంద్రప్రభుత్వ పరిధిలో భారీ ఎత్తున ఉద్యోగాల ఖాళీలు ఏర్పడినట్లు రాజ్యసభకు తెలిపింది ఎన్డీఏ సర్కార్. గతేడాది మార్చి 1 నాటికి సుమారు 7 లక్షల ఖాళీలు ఉన్నట్లు సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు.

జితేంద్రసింగ్ తెలిపిన సమాచారం మేరకు మొత్తం 6,83,823 ఖాళీలు ఉన్నాయి. ఇందులో గ్రూప్-సీ స్థాయివే అత్యధికం.

  • గ్రూప్​ సీ - 5,74,289
  • గ్రూప్ బీ - 89,638
  • గ్రూప్ ఏ - 19,896

ఈ ఖాళీలకు సంబంధించి 1,05,338 ఉద్యోగాలకు నియామక ప్రక్రియను ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. మరో 4,08,591 ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియ ఎస్​ఎస్​సీ, ఆర్​ఆర్​బీ చేపడుతున్నాయని వివరించారు.

నియామక ప్రక్రియలో జాప్యాన్ని నివారించేందుకు కంప్యూటర్​ బేస్​డ్​ పరీక్షలను నియామక సంస్థలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాన్​ గెజిటెడ్​ ఉద్యోగాలకు ముఖాముఖిని రద్దు చేసినట్లు చెప్పారు.

ఇదీ చూడండి: కశ్మీర్​ ఆంక్షల గుప్పెట్లో లేదు: సుప్రీంకు కేంద్రం వివరణ

ABOUT THE AUTHOR

...view details