కరోనా సంక్షోభం వల్ల ప్రపంచంలోని పలు దేశాల్లో చిక్కుకుపోయిన 10 లక్షల మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. వందే భారత్ మిషన్లో భాగంగా మరో లక్షా 30 వేల మంది విదేశీయులను తమ దేశాలకు చేరవేసినట్లు వెల్లడించారు. ఇప్పటికీ విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులను తీసుకొచ్చేందుకు ఈ మిషన్ను కొనసాగిస్తామన్నారు పూరి.
వందే భారత్ మిషన్: స్వదేశానికి 10 లక్షల మంది - వందే భారత్ మిషన్ న్యూస్
వందే భారత్ మిషన్లో భాగంగా 10 లక్షల మంది భారతీయులు స్వదేశానికి చేరారు. మరో లక్షా 30 వేల మంది విదేశీయులను తమ దేశాలకు చేర్చారు. ఈ మేరకు పౌరవిమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.
![వందే భారత్ మిషన్: స్వదేశానికి 10 లక్షల మంది Nearly one million stranded Indians returned, over 130 K people flown to other countries under VBM](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8374148-thumbnail-3x2-vande-bharat-mission.jpg)
వందే భారత్ మిషన్: స్వదేశానికి 10 లక్షల మంది
ఈ మిషన్లో భాగంగానే ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి మరో ప్రత్యేక విమానం ఏఐ 301... నేడు భారత్కు రానుంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేసింది సిడ్నీలోని భారత రాయబార కార్యాలయం.
ఇదీ చూడండి:తండ్రి ఆఖరి చూపు ఖరీదు రూ. 51,000/-..!
Last Updated : Aug 11, 2020, 12:00 PM IST