తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పిల్లలు ఆడుకునే బొమ్మలు 67% ప్రమాదకరమైనవే' - qic news related to toys

ప్రాణం లేని బొమ్మలంటే పిల్లలకు భలే ఇష్టం. వాటిని చిన్నారులు అన్నీ తామై చూసుకుంటారు. స్నానం చేయిస్తారు, అన్నం తినిపిస్తారు, నిద్ర పుచ్చుతారు. అలాంటి బొమ్మలు కొన్ని మార్కెట్​లో ప్రమాదకరంగా మారాయి. వాటి తయారీలో ఉపయోగించే భయంకరమైన రసాయనాల వల్ల పేలుడు స్వభావంతో పాటు.. క్యాన్సర్​ వంటి గుణాల్ని కలిగి ఉంటున్నాయి.

Nearly 67 per cent of imported toys have failed the testing survey of the Quality Council of India (QCI).
'పిల్లలు ఆడుకునే బొమ్మల్లో 67% ప్రమాదకరమైనవే'

By

Published : Dec 22, 2019, 4:57 PM IST

భారత్ దిగుమతి చేసుకుంటున్న బొమ్మలు దాదాపు 67 శాతం ప్రమాదకరమని.. భారతీయ నాణ్యత మండలి(క్యూసీఐ) తెలిపింది. దిల్లీ మార్కెట్​లో అందుబాటులో ఉన్న కొన్ని బొమ్మలను పరీక్షించగా.. అందులో 66.9శాతం నిర్దిష్ట ప్రమాణాలకు లోబడి లేవు. కేవలం 33.1శాతం మాత్రమే అన్ని పరీక్షల్లో నెగ్గాయి.

క్యూసీఐ ఏమంటోందంటే..?

భద్రత పేరుతో అధిక స్థాయిలో ఫ్తాలెట్​, భారీ మెటల్​ను ఉపయోగిస్తున్నందునే 30 శాతం ప్లాస్టిక్​ బొమ్మలు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయని క్యూసీఐ నివేదిక తెలిపింది. 80 శాతం వరకు ప్లాస్టిక్​ బొమ్మలు యాంత్రిక, భౌతిక లక్షణాల కారణంగా విరిగిపోతున్నాయని క్యూసీఐ పేర్కొంది.

సరకు పరీక్ష తప్పనిసరి...

85 శాతం చైనా ఉత్పత్తులను శ్రీలంక, మలేషియా, జర్మనీ, హాంగ్​కాంగ్​, అమెరికా దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. విదేశీ వాణిజ్య సంచాలక ప్రధాన కార్యాలయం(డీజీఎఫ్​టీ) వీటి టెస్టింగ్ నివేదికలను పరీక్షిస్తూ... సరకు ఆధారిత పరీక్షను తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించిన ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) ప్రకటన కోసం ముసాయిదాను క్వాలిటీ కంట్రోల్​ ఆర్డర్​(క్యూసీఓ)కు పంపించారు.

'యాంత్రికంగా విఫలమైన బొమ్మలు పిల్లలకు చర్మవ్యాధులను కలుగజేస్తాయి. అందులో వాడిన హానికరమైన రసాయనాలు క్యాన్సర్​కు కారణమవుతున్నాయి. ఒక బాలుడు బొమ్మతో ఆడుకొంటుండగా... అందులో మంటలు ఏర్పడ్డాయి. భారత నౌకల్లో వచ్చే ప్రతి సరకు నుంచి నమూనాలను తీసుకొని పరీక్షిస్తారు. అవి విఫలమైతే నాశనమవుతాయి లేదా తయారీదారులకు తిరిగిపంపుతారు. బొమ్మల ద్వారా దేశంలో పిల్లల ఆరోగ్యం, భద్రతకు హాని కలగకుండా ఉండటానికే నౌకాశ్రయాలు నిబంధనల్ని తప్పనిసరి చేశాయి' - ఆర్పీ సింగ్​, క్యూసీఐ ప్రధాన కార్యదర్శి

ABOUT THE AUTHOR

...view details