భారతీయులను కరోనా వైరస్ కలవరపెడుతోంది. దేశవ్యాప్తంగా వైరస్ కేసులు 500లకు చేరువయ్యాయి. ఇప్పటివరకు 492 మంది ప్రాణాంతక మహమ్మారి బారినపడ్డారు. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వివరాలు వెల్లడించింది.
దేశంలో ప్రస్తుతం 446 యాక్టివ్ కేసులున్నాయి. 36 మంది కరోనాను జయించి ఆసుపత్రి నుంచి ఇళ్లకు చేరారు. సుమారు 41 మంది విదేశీ బాధితులూ భారత్లో చికిత్స పొందుతున్నారు.
వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నెల 31 వరుకు దేశవ్యాప్తంగా 548 జిల్లాల్లో లాక్డౌన్ విధించింది కేంద్రం. ప్రజా రవాణా సేవలు నిలిపివేసింది. ఎవరైనా బయటకు వస్తే అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.