తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాతో భవిష్యత్తులో పిల్లలపైనే అధిక ప్రభావం! - children latest updates

కొవిడ్​-19 కారణంగా భవిష్యత్తులో చిన్నారులే అధికంగా ప్రభావితమవుతారని క్రై అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది. లాక్​డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా పిల్లల తల్లిదండ్రులు రోగనిరోధకాల సేవలు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సర్వేలో వెల్లడించింది.

Nearly 50% parents with kids below 5 yrs not able to access immunisation
కరోనాతో భవిష్యత్తులో చిన్నారులపైనే అధిక ప్రభావం

By

Published : May 13, 2020, 11:59 AM IST

ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లిదండ్రుల్లో 50శాతం మంది టీకా సేవలను పొందలేకపోతున్నారని చిన్నారుల హక్కుల స్వచ్ఛంద సంస్థ చైల్డ్​ రైట్స్​ ఫర్ యూ(సీఆర్​వై) తెలిపింది. దేశవ్యాప్తంగా 22రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్వే నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించింది.

కరోనా వ్యాప్తి కట్టడికి విధించిన దేశవ్యాప్త లాక్​డౌన్ కారణంగా పిల్లలకు రోగనిరోధకాలు(టీకాలు) అందించేందుకు తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు క్రై పేర్కొంది. ఫలితంగా చిన్నారులపై తీవ్ర ప్రభావం పడుతున్నట్లు వివరించింది.

తొలి రెండు సార్లు విధించిన లాక్​డౌన్ సమయంలో మొత్తం 1100 మంది తల్లిదండ్రులు, చిన్నారుల సంరక్షుల నుంచి వివరాలు సేకరించింది క్రై.

క్రై సర్వే వివరాలు..

  • ఐదేళ్ల లోపు చిన్నారులు గల తల్లిదండ్రులలో కేవలం 50 శాతం మందికే రోగనిరోధకాల సేవలు అందుబాటులో ఉన్నాయి.
  • లాక్​డౌన్ సమయంలో నాలుగింట ఒకవంతు వారికి మాత్రమే చిన్నారుల సాధారణ ఆరోగ్య సేవలు అందుబాటులో ఉన్నాయి.
  • కరోనా వైరస్ ప్రభావం చిన్నారులపై లేనప్పటికీ.. రోగనిరోధకాలు అందకపోతే భవిష్యత్తులో వారే అధిక సంఖ్యలో బాధితులవుతారు.
  • లాక్​డౌన్ కారణంగా పిల్లల విద్యాభ్యాసాలపై తీవ్ర ప్రభావం పడినట్లు సర్వేలో పాల్గొన్న 77శాతం మంది తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలో 87శాతం మంది, పశ్చిమ ప్రాంతాల్లో 56శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు.
  • పిల్లల రోజువారీ కార్యక్రమాలు ప్రభావితమైనట్లు 60శాతం మంది చెప్పారు.
  • లాక్​డౌన్ సమయంలో పిల్లలు మానసిక ఉల్లాసాన్ని కోల్పోయారని 37 శాతం మంది అభిప్రాయపడ్డారు.
  • ఆన్​లైన్​లో గడిపే సమాయాన్ని చిన్నారులు గణనీయంగా పెంచినట్లు 88 శాతం మంది తెలిపారు.

దేశ జనాభాలో 40శాతం మంది చిన్నారులే. కానీ వారికి బడ్జెట్లో కేటాయించే నిధులు కేవలం 3శాతమేనని క్రై సంస్థ సీఈఓ పూజా మర్వాహా వెల్లడించారు. కరోనా సంక్షోభం సమయంలోనూ చిన్నారుల అంశం అసలు చర్చకు రావడంలేదన్నారు. ఆన్​లైన్​లో నిర్వహించిన సర్వే ద్వారా లాక్​డౌన్ సమయంలో .. చిన్నారుల శారీరక, మానసిక ఆరోగ్యం, పోషక పదార్ధాలు, విద్య, రక్షణపై ఏ విధంగా ప్రభావం పడుతుందో స్పష్టమవుతోందన్నారు.

ABOUT THE AUTHOR

...view details