ఒడిశాలోని తీర ప్రాంతమైన గహిర్మాత అభయారణ్యంలో సుందర దృశ్యాలు కనపడుతున్నాయి. గత నెల రోజులుగా దాదాపు 2కోట్లకుపైగా ఓలివ్ రిడ్లే జాతి తాబేళ్లు.. గుడ్ల నుంచి బయటకువచ్చి సముద్రంలోకి చేరుతున్నాయి. అంతరించిపోతున్న ఈ జాతికి ఇది శుభసూచకంలా మారింది.
ప్రపంచంలోనే అతిపెద్ద తాబేళ్ల నివాసంగా ఈ గహిర్మాత సముద్ర తీరానికి పేరుంది. గతనెలలో దాదాపు 4.70లక్షల ఆడ తాబేళ్లు... ఈ తీరంలో గుడ్లుపెట్టి వెళ్లాయి.
"అధికారుల అంచనా ప్రకారం.. 2కోట్ల తాబేళ్లు జన్మించాయి. అనంతరం బంగాళాఖాతంలోకి చేరుకున్నాయి. ఈ ఏడాది ఎలాంటి ఆటంకాలు కలగపోవడం వల్ల.. తాబేళ్ల సంఖ్య పెరిగింది."