కరోనా సంక్షోభం నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దాదాపు 18వేల మంది ఖైదీలను పెరోల్‌పై విడుదల చేసింది ఉత్తరప్రదేశ్. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శి(హోం) అవానిష్ కుమార్ అవస్థి వెల్లడించారు.
"సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ నెల 25 నాటికి 17వేల 963మంది ఖైదీలను పెరోల్‌పై విడుదల చేశాం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖైదీల్లో ఇది 15-17శాతం ఉంటుంది. జువనైల్ జస్టిస్ బోర్డు అనుమతులతో బాలల సంరక్షణ గృహాల నుంచి 665 మందిని కూడా పెరోల్‌పై విడుదల చేశాం."
--- అవానిష్ కుమార్ అవస్థి