అసోంలోని 24 జిల్లాల్లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల మందికిపైగా ప్రభావితమయ్యారు. 950 గ్రామాలు వరద గుప్పిట్లో ఉన్నాయి. వందలాది ఇళ్లు నీటమునిగాయి. జనజీవనం పూర్తిగా స్తంభించింది. 85,546 హెక్టార్ల పంట భూమి నీట మునిగినట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు 18 జిల్లాల్లోని రోడ్లు, వంతెనలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
వరదల కారణంగా దాదాపు 8 లక్షలకుపైగా పెంపుడు జంతువులు, 4.24 లక్షలకు పైగా పౌల్ట్రీలు ప్రభావితమయ్యాయి.