బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ పక్షాలన్నీ కలిసిపోటీ చేస్తాయని భాజపా జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అఖండ మెజారిటీతో తిరిగి అధికారాన్ని చేజిక్కిచ్చుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.బిహార్ పర్యటన చివరి రోజులో భాగంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి నడ్డా ప్రసంగించారు.
అంతకుముందు జేడీయూ అధినేత నితీశ్ కుమార్తో సమావేశమయ్యారు నడ్డా. ముఖ్యమంత్రితో గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో ఎన్డీఏ పార్టీల మధ్య సీట్ల పంపకంపై చర్చించినట్లు తెలుస్తోంది. మిత్రపక్షాల మధ్య ఏర్పడిన అభిప్రాయబేధాలు సకాలంలో పరిష్కరించే విధంగా నడ్డా హామీ ఇచ్చినట్లు సమాచారం.