తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాషాయ సునామీ 2.0: సర్వం మోదీమయం - ప్రభుత్వం

ఎటు చూసినా కమల వికాసమే... ఎక్కడ చూసినా కాషాయవర్ణ శోభితమే . 2014 సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన విజయాన్ని మైమరిపిస్తూ మరోసారి మోదీ హవాతో భాజపా దూసూకుపోతోంది. కాంగ్రెస్​ కనీస పోటీ ఇవ్వలేకపోతోంది.

నమో 2.0: యావత్​ భారతం- కాషాయ వర్ణ శోభితం

By

Published : May 23, 2019, 1:24 PM IST

Updated : May 23, 2019, 2:32 PM IST

ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలే నిజమవుతున్నాయి. దేశంలోని ప్రతి ఇంటి నుంచి మోదీ గాలి వీస్తుందని ప్రచార సభల్లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ మాటలు వాస్తవమయ్యాయి. మరోసారి మోదీ ప్రభంజనంలో కాంగ్రెస్​ సహా విపక్షాలు కొట్టుకుపోయాయి. కనీస పోటీని ఇవ్వలేకపోయాయి. ఇప్పటివరకు అడుగుపెట్టలేని బంగాల్​లోనూ భాజపా మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది.

300 సీట్లుకుపైగా సాధిస్తామని ముందునుంచి చెప్పుకొస్తుంది ఎన్డీఏ. ఆశించినట్లుగానే విజయపథాన దూసుకుపోతోంది.

భాజపాకు ఆయువుపట్టుగా ఉన్న ఉత్తరప్రదేశ్, బిహార్​, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్​ రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో సాధించిన ఫలితాలను భాజపా పునరావృతం చేస్తోంది. ఊహించని రీతిలో బంగాల్​, ఒడిశాలోనూ మెరుగైన ప్రదర్శన చేస్తోంది కాషాయదళం. దిల్లీలో కాషాయ పార్టీ ముందు ఆమ్​ఆద్మీ తేలిపోయింది.

ఫలితాల సరళిని పరిశీలిస్తే ఎన్డీఏ 300కుపైగా సీట్లు సాధించడం అనివార్యంగా కనిపిస్తోంది. ఈ ఫలితాలతో మోదీకి సరితూగే నాయకుడు ప్రతిపక్షంలో లేరన్న విషయం తేటతెల్లమైంది.

3 రాష్ట్రాలు ముంచేశాయి...

భాజపాకు ప్రత్యామ్నాయం తామేనని ప్రజల్లో విశ్వాసం కల్పించడంలో కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ విఫలమైనట్లు ఫలితాలు చెబుతున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్​గఢ్​ మూడు రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్​ ప్రభుత్వాలు ప్రజల నమ్మకాన్ని పొందలేకపోయాయి.

ఇదీ చూడండి: కీలక రాష్ట్రాల్లో భాజపా విజయబావుటా..!

Last Updated : May 23, 2019, 2:32 PM IST

ABOUT THE AUTHOR

...view details