తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'హాథ్రస్' ఘటనపై బాలీవుడ్​ నటికి నోటీసులు - NCW notices to Swara Bhasker

హాథ్రస్ బాధితురాలి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది జాతీయ మహిళా కమిషన్. భాజపా ఐటీ సెల్ అధ్యక్షుడు అమిత్ మాల్వియా, కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, సినీ నటి స్వరా భాస్కర్​కు పంపిన ఈ నోటీసుల్లో.. అభ్యంతరకర పోస్టులను వెంటనే తొలగించాలని సూచించింది.

NCW sends notices to Amit Malviya, Digvijay Singh and Swara Bhasker for revealing identity of Hathras victim
'హాథ్రస్ బాధితురాలి ఫొటోలు వెంటనే తొలగించండి'

By

Published : Oct 6, 2020, 5:13 PM IST

భాజపా ఐటీ సెల్ అధ్యక్షుడు అమిత్ మాల్వియా, కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, సినీ నటి స్వరా భాస్కర్​కు నోటీసులు జారీ చేసింది జాతీయ మహిళా కమిషన్(ఎన్ సీ డబ్ల్యూ). హాథ్రస్​లో సామూహిక అత్యాచారానికి గురైన దళిత యువతి వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేయడంపై వివరణ కోరింది.

తమ ట్విట్టర్ ఖాతాల్లో పంచుకున్న బాధితురాలి చిత్రాలను వెంటనే తొలగించాలని ముగ్గురు ప్రముఖుల్ని ఆదేశించింది మహిళా కమిషన్. మున్ముందు ఇలాంటి పోస్టులు చేయొద్దని హితవు పలికింది.

ఇదీ చదవండి:ఆ నలుగురు కామాంధులకు జీవిత ఖైదు

ABOUT THE AUTHOR

...view details