మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా ఎన్సీపీ నాయకుడు సంజయ్ షిండే(55) కారు ప్రమాదంలో సజీవదహనం అయ్యారు. ముంబయి-ఆగ్రా హైవే మీద ప్రయాణం చేస్తుండగా నాసిక్ సమీపంలోని పింపాల్‌గావ్ బస్వంత్ టోల్‌ప్లాజా వద్ద కారు షార్ట్‌సర్క్యూట్‌తో కాలిపోయింది. ద్రాక్షతోటకు క్రిమిసంహారక మందులు తీసుకువచ్చేందుకు వెళ్తుండగా మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ద్రాక్షసారా తయారీకి ద్రాక్షను ఎగుమతి చేసే వ్యాపారిగా నాసిక్ జిల్లాలో సంజయ్ షిండేకు పేరుంది. ఈయన ఎన్సీపీ తాలూకా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.
కారు ప్రమాదంలో ఎన్సీపీ నేత సజీవదహనం - శానిటైజర్
ఎన్సీపీ నాయకుడు సంజయ్ షిండే(55) కారు ప్రమాదంలో సజీవదహనమయ్యారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. కారులో ఉన్న హ్యాండ్ శానిటైజర్.. మంటలు పెరిగేందుకు కారణమైందని భావిస్తున్నారు.
కారు ప్రమాదంలో ఎన్సీపీ నేత సజీవదహనం
ప్రమాదం జరిగినప్పుడు కారు కాడ్వా నది ఓవర్‌బ్రిడ్జికి సమీపంలో ఉంది. షార్ట్‌సర్క్యూట్‌కు గురైనపుడు కారులో ఉన్న హ్యాండ్ శానిటైజరు కారణంగా మంటలు అమాంతం చెలరేగినట్టు తెలుస్తోంది. కారులో ఉన్న షిండే అద్దాలు పగులకొట్టేందుకు ప్రయత్నించినా మంటలు శరవేగంగా వ్యాపించడంతో ప్రయోజనం లేకపోయింది. స్థానికులు హుటాహుటిన ఫైర్ సిబ్బందిని పిలిచినా షిండేను కాపాడలేకపోయారు.