తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అజిత్​పవార్​ను తొలగించాం'- గవర్నర్​కు ఎన్​సీపీ లేఖ - maharastra trending news

ఎన్​సీపీ సీనియర్ నేత జయంత్​ పాటిల్​ ఇవాళ ఉదయం మహారాష్ట్ర గవర్నర్​ను కలిసేందుకు వెళ్లారు. ఎన్​సీపీ శాసనసభా పక్ష నేతగా అజిత్ పవార్​ను తొలిగించిన విషయాన్ని కోశ్యారీతో చెప్పేందుకు వెళ్లగా.. గవర్నర్ రాజ్​భవన్​లో లేరు. ఫలితంగా అక్కడి నుంచి వెనుదిరిగారు జయంత్​.

'అజిత్​పవార్​ను తొలగించాం'-గవర్నర్​కు ఎన్​సీపీ లేఖ

By

Published : Nov 24, 2019, 1:34 PM IST

Updated : Nov 24, 2019, 2:25 PM IST


మహారాష్ట్ర రాజకీయాలు ప్రతిక్షణం ఉత్కంఠగా మారుతున్నాయి. దేవేంద్ర ఫడణవీస్​కు మద్దతిస్తూ.. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజిత్​ పవార్​ను ఎస్​సీపీ శాసనసభా పక్షనేతగా శనివారమే తొలగించారు ఆ పార్టీ అధినేత శరద్​ పవార్​. ఇదే విషయాన్ని గవర్నర్ కోశ్యారీకి తెలిపేందుకు ఎన్​సీపీ నేత జయంత్​ పాటిల్​ ఇవాళ రాజ్​భవన్​కు వెళ్లారు. అయితే ఆ సమయంలో గవర్నర్​ అక్కడ లేనందున జయంత్​ వెనుదిరిగి వెళ్లిపోయారు.

శనివారమే తొలగింపు..

కాంగ్రెస్​-ఎన్​సీపీ-శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో ఎన్​సీపీ నేత అజిత్​ పవార్ అనూహ్య ట్విస్ట్ ఇచ్చారు. భాజపాకు మద్దతిచ్చి.. దేవేంద్ర ఫడణవీస్​ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే అజిత్​ను శాసనసభాపక్ష నేత హోదా నుంచి తొలగించారు శరద్​ పవార్​. ఆయన స్థానంలో మహారాష్ట్ర ఎన్​సీపీ అధ్యక్షుడు జయంత్​ పాటిల్​ను నియమిస్తున్నట్లు ప్రకటించారు.

ఇదీ చదవండి:ఆ రంగంలో 'అమిత్​ షా'నే బెస్ట్​ ఫినిషర్​..!

Last Updated : Nov 24, 2019, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details