తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సేనతో 'మహా' ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్​సీపీ-కాంగ్రెస్​ రెడీ! - శివసేనతో రేపు కాంగ్రెస్​, ఎన్​సీపీ చర్చలు

మహారాష్ట్రలో శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్​, ఎన్​సీపీ సిద్ధమైనట్లు కనిపిస్తోంది. అధికారం పంచుకోవడం, కనీస ఉమ్మడి ప్రణాళికపై ఇరు పార్టీల కసరత్తు పూర్తయిందని నేతలు ప్రకటించారు. శివసేనతో చర్చించి కూటమి ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

సేనతో 'మహా' ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్​సీపీ-కాంగ్రెస్​ రెడీ!

By

Published : Nov 21, 2019, 7:18 PM IST

మహారాష్ట్రలో శివసేన-ఎన్​సీపీ-కాంగ్రెస్​ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు... కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు
సమాచారం. కాంగ్రెస్​ అధినేత్రి సోనియాగాంధీ నివాసంలో జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో మహారాష్ట్ర పరిణామాలపై పార్టీ నేతలు చర్చించారు.

ఎన్​సీపీతో బుధవారం జరిపిన చర్చల సారాంశాన్ని కమిటీ సభ్యులు సీడబ్ల్యూసీకి వివరించారు. అనంతరం ఎన్​సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో కాంగ్రెస్ నేతలు మరోసారి చర్చలు జరిపారు.

ప్రకటన...

కాంగ్రెస్​, ఎన్​సీపీ నేతల సుదీర్ఘ సమావేశం పూర్తయ్యాక మహారాష్ట్ర మాజీ సీఎం కాంగ్రెస్​ సీనియర్​ నేత పృథ్వీరాజ్​ చవాన్​ మీడియాతో మాట్లాడారు. శివసేనతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై ఉన్న అన్నీ అంశాలపైనా కాంగ్రెస్​, ఎన్​సీపీ పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. కనీస ఉమ్మడి ప్రణాళిక, కూటమి ఏర్పాటు, అధికార భాగస్వామ్యం తదితర విషయాలను శివసేనతో చర్చించి ప్రకటిస్తామన్నారు. త్వరలోనే సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

రేపే తుది నిర్ణయం...

రేపు ముంబయిలో శివసేన, ఎన్​సీపీ నేతలతో సమావేశం తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

ఈనెల 30న ఝార్ఖండ్ లో తొలి విడత పోలింగ్​కు ముందే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని సీనియర్​ ఎన్​సీపీ నేతలు సంకేతాలు ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైనట్లు మూడు పార్టీలు.. గవర్నర్‌కు వేర్వేరుగా లేఖలు పంపే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details