తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా'నాటకీయం: ఎస్​సీపీ ఎమ్మెల్యే ఆచూకీ గల్లంతు! - ncp mla missing

మహారాష్ట్రలో శివసేన, ఎన్​సీపీ, కాంగ్రెస్ మధ్య ఏకాభిప్రాయం కుదురుతుందన్న దశలో  ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే నాటకీయ పరిణామాలకు మాత్రం తెరపడలేదు. ఎన్​సీపీ ఎమ్మెల్యే ఒకరు కనిపించకుండా పోయారని షాహాపుర్ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది.

'మహా'నాటకీయం: ఎస్​సీపీ ఎమ్మెల్యే ఆచూకీ గల్లంతు!

By

Published : Nov 24, 2019, 9:02 AM IST

మహారాష్ట్రలో నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. అందరినీ ఆశ్చర్యపరుస్తూ భాజపా అధికారంలోకి వచ్చి గంటలైనా గడవక ముందే మహారాష్ట్ర మరో ఆసక్తికర అంశానికి వేదికైంది. ఓ ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ.. ఠాణే జిల్లాలోని షాహాపుర్​ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది.

రాజ్​భవన్​లో ప్రమాణస్వీకారానికి ఎమ్మెల్యే దౌలత్ దరోడా హాజరయ్యారని, అనంతరం కనిపించకుండా పోయారని పేర్కొంటూ మాజీ ఎమ్మెల్యే పాండురంగ్ బరోరా షాహాపుర్ పోలీస్​స్టేషన్​లో కేసు నమోదు చేశారు. దరోడా షాహాపుర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఫిర్యాదు ప్రతి

ఇదీ చూడండి: 'మహా' ప్రభుత్వంపై నేడు సుప్రీం అత్యవసర విచారణ

ABOUT THE AUTHOR

...view details