తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఎంపీలు దిల్లీకి వెళ్లవద్దు.. నియోజకవర్గంలోనే ఉండండి' - దేశంలో కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్​ సమావేశాల్లో పాల్గొనకుండా తిరిగి తమ నియోజకవర్గాలను రావాలని సూచిస్తున్నాయి వేర్వేరు పార్టీలు. మహారాష్ట్రలో ఎన్​సీపీ, బంగాల్​లో తృణమూల్ కాంగ్రెస్​ పార్టీ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాయి. మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ అధికారులకు సహాయం చేయాలని సూచించాయి.

NCP asks MPs to not return to Delhi, help at local areas in COVID-19 fight
ఎంపీలు దిల్లీకి వెళ్లవద్దు.. నియోజకవర్గంలోనే ఉండండి

By

Published : Mar 22, 2020, 6:56 PM IST

దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తున్న తరుణంలో తమ పార్టీ పార్లమెంట్ సభ్యులను దిల్లీకి వెళ్లవద్దని సూచించింది ఎన్​సీపీ. ప్రాణాంతక వైరస్​ను ఎదుర్కొనేందుకు నియోజకవర్గంలోని ప్రజలకు సాయం చేయాలని తెలిపింది.

"ఎన్​సీపీ పార్లమెంట్​ సభ్యులారా... దయచేసి లోక్​సభ, రాజ్యసభ సమావేశాలకు వెళ్లవద్దు. మీ నియోజకవర్గంలోనే ఉండి కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ సంస్థలకు సాయం చేయండి."

-శరద్​ పవార్​, ఎన్​సీపీ అధ్యక్షుడు ట్వీట్​

బంగాల్​ ఎంపీలు కూడా..

కరోనా నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనకుండా తమ నియోజకవర్గాలకు తిరిగి రావాలని తన పార్టీ ఎంపీలను తృణమూల్​ కాంగ్రెస్ ఆదేశించింది. టీఎంసీ నుంచి లోక్​ సభలో 23 మంది, రాజ్యసభలో 13 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఇదీ చూడండి:ఉత్తర భారతంలో 'జనతా కర్ఫ్యూ' విజయవంతం

ABOUT THE AUTHOR

...view details