తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సుప్రీం తీర్పు పట్ల ముస్లింలు సంతోషంగా ఉన్నారు'

అతి సున్నితమైన అయోధ్య తీర్పులో సుప్రీం నిర్ణయంపై రివ్యూ పిటిషన్​ వేస్తామన్న సున్నీవక్ఫ్‌బోర్డు న్యాయవాది జఫర్‌యాబ్ జిలానీ నిర్ణయాన్ని తప్పుబట్టారు జాతీయ మైనారిటీ కమిషన్‌ ఛైర్‌పర్సన్ ఘయోరుల్ హసన్ రిజ్వీ. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు పట్ల ముస్లిం ప్రజలు ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు.

సుప్రీం తీర్పుపై ముస్లింల హర్షం: హసన్ రిజ్వీ

By

Published : Nov 9, 2019, 2:52 PM IST

అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామన్న సున్నీవక్ఫ్‌ బోర్డు న్యాయవాది జఫర్‌యాబ్ జిలానీ నిర్ణయాన్ని జాతీయ మైనారిటీ కమిషన్‌ ఛైర్‌పర్సన్ ఘయోరుల్ హసన్ రిజ్వీ తప్పుబట్టారు. సుప్రీంకోర్టు తీర్పు పట్ల ముస్లింలు సంతోషంగా ఉన్నారని రిజ్వీ తెలిపారు. ఇదో గొప్ప తీర్పు కానప్పటికీ జాతి ఐక్యతకు ఈ తీర్పు సంకేతంగా నిలిచిందని అన్నారు.

సోదర భావానికి, సౌభ్రాతృత్వానికి ఇది ఉదాహరణగా అభివర్ణించారు. ఈ అంశం ఇక్కడితో ముగిసిందన్న రిజ్వీ.. దేశం మరోసారి ఇలాంటి అంశాల జోలికి వెళ్లకుండా అభివృద్ధి వైపు సాగాలని ఆకాంక్షించారు.

ఇదీ చూడండి:'తీర్పును గౌరవిస్తున్నాం- అంతా సామరస్యంగా ఉండాలి'

ABOUT THE AUTHOR

...view details