తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫరూక్​తో నేతల భేటీ- '370' పునరుద్ధరణే లక్ష్యం!

దాదాపు 2 నెలల తర్వాత  మీడియాకు కనిపించారు నేషనల్​ కాన్ఫరెన్స్​ అధినేత ఫరూక్​ అబ్దుల్లా. ఆర్టికల్​ 370 రద్దు జరిగిన నాటి నుంచి ఆయనను గృహనిర్బంధంలో ఉంచింది ప్రభుత్వం. ఫరూక్​ పార్టీకి చెందిన 15 మంది నాయకుల బృందం నేడు ఆయనను కలసింది. ఆర్టికల్​ 370 కోసం పోరాడి తీరతామని వారందరూ నినదించారు.

ఫరూక్​తో నేతల భేటీ- '370' పునరుద్ధరణే లక్ష్యం!

By

Published : Oct 6, 2019, 2:50 PM IST

నేషనల్​ కాన్ఫరెన్స్​ పార్టీకి చెందిన 15 మంది నేతల బృందం.. తమ అధినేత ఫరూక్​ అబ్దుల్లాను శ్రీనగర్​లోని ఆయన నివాసంలో కలిశారు. ఆర్టికల్​ 370 రద్దు చేసిన నాటి నుంచి ఆయనను ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచింది.

ఫరూక్​ను కలిసేందుకు శ్రీనగర్​లోని ఆయన నివాసానికి వెళ్లారు పార్టీ నేతలు. ఫరూక్​ అబ్దుల్లా ఆయన భార్య మోల్లీ అబ్దుల్లాతో కలసి వారికి స్వాగతం పలికారు. మీడియాకు విజయ సంకేతం చూపిస్తూ.. అబ్దుల్లా లోపలికి వెళ్లారు.

పార్టీ నేతలు.. ఫరూక్​ను కలిసే ముందు మీడియాతో మాట్లాడారు. ఆర్టికల్​ 370ని పునరుద్ధరించేలా చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.

"మేము మోసపోయాం. ఆర్టికల్​ 370 పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నాం. ఆగస్టు 5కు ముందు కశ్మీర్​ ఎలా ఉందో.. తిరిగి అలా మారాలి. ఇలాంటి నిర్ణయాలను తీసుకునేముందు కేంద్రం రాజ్యాంగాన్ని పరిశీలించి ఉండాల్సింది. 370 రద్దుతో రాజ్యాంగంపై దాడి చేశారు. రాష్ట్ర ప్రజలు, స్థానిక నేతల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు."
- ఎన్​సీ బృందం

ఆగస్టు 5న ఆర్టికల్​ 370ని కశ్మీర్​లో రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకునే ముందే.. రాష్ట్రవ్యాప్తంగా ఆంక్షలు విధించింది. ముఖ్యనేతలైన ఎన్​సీ అధినేత ఫరూక్​ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్​ అబ్దుల్లా, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీని గృహనిర్బంధం చేసింది.

ABOUT THE AUTHOR

...view details