కశ్మీర్: 'అబ్దుల్లా'ను కలిసేందుకు పార్టీ నేతలకు అనుమతి గృహ నిర్బంధంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లాను ఆ పార్టీ నేతలు కలిసేందుకు జమ్ముకశ్మీర్ పరిపాలన విభాగం అనుమతి ఇచ్చింది.
పార్టీ నేతలను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌ను జమ్ము నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు దేవేందర్ సింగ్ రానా కోరారు. రానా నేతృత్వంలోని పార్టీ బృందం రేపు జమ్ము నుంచి శ్రీనగర్‌కు బయలుదేరనుంది.
రెండు రోజుల క్రితం జమ్ములో జరిగిన జిల్లా అధ్యక్షులు, సీనియర్ నాయకుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు రానా.
ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దుకు ముందురోజు నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాతోపాటు పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ సహా ప్రధాన పార్టీల నేతలను గృహ నిర్బంధంలో ఉంచింది ప్రభుత్వం.
ఇదీ చూడండి: భారత్-బంగ్లాదేశ్ మైత్రి ప్రపంచానికే ఆదర్శం: మోదీ