జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై చర్చించేందుకు ఆ రాష్ట్ర మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) పార్టీ ప్రతినిధుల బృందం ప్రధాని నరేంద్రమోదీని కలిసింది. ఎన్నికలను ఈ ఏడాది ఆఖరులోగా నిర్వహించాలని మోదీని కలిసి విజ్ఞప్తి చేశారు పార్టీ నేతలు.
లోయలో పరిస్థితులపై వివరణ
మోదీతో దాదాపు 20 నిమిషాల పాటు సమావేశమైన ఎన్సీ సభ్యుల బృందం కశ్మీర్‌లోయలోని పరిస్థితులను దెబ్బతీసేలా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరింది. కశ్మీర్‌లోని తాజా పరిస్థితులను ప్రధానికి వివరించిన పార్టీ నేతలు ప్రజలపై కొనసాగుతున్న అరెస్టుల పర్వాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్లారు.