ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. సుక్మా జిల్లాలోని కుకనార్‌లో ఓ రోడ్డు నిర్మాణ సంస్థకు చెందిన వాహనాలను తగలబెట్టారు. రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న రెండు ప్రొక్లెయినర్లతో సహా 6 వాహనాలను దగ్ధం చేశారు మావోయిస్టులు.
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దుశ్చర్య.. వాహనాలకు నిప్పు - Maoists updates
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోమారు రెచ్చిపోయారు. సుక్మా జిల్లాలో ఓ రోడ్డు నిర్మాణ సంస్థకు చెందిన వాహననాలకు నిప్పంటించారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దుశ్చర్య
అర్ధరాత్రి సమయంలో మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడ్డారని.. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు స్థానిక పోలీసు అధికారులు వెల్లడించారు.