ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో నక్సలైట్లు మరోసారి రెచ్చిపోయారు. మావోయిస్టులు అత్యాధునిక పేలుడు పదార్థాన్ని(ఐఈడీ) పేల్చారు. ఈ ఘటనలో ఓ సీఆర్పీఎఫ్ జవాను మృతి చెందారు. ఐదుగురు జవానులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగింది.
నక్సలైట్ల దాడిలో జవాను మృతి - దంతేవాడ
ఛత్తీస్‌గఢ్ దంతేవాడ జిల్లాలో నక్సలైట్లు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఓ సీఆర్పీఎఫ్ జవాను మృతి చెందారు. మొత్తం ఆరుగురికి గాయాలయ్యాయి.

నక్సలైట్ల దాడిలో జవాను మృతి
నక్సలైట్ల దాడిలో జవాను మృతి
రాష్ట్ర పోలీసులతో పాటు 231 బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్ బృందం అరన్‌పుర్ ప్రాంతంలో రోడ్డు భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. అరన్‌పుర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కొండపార, కమల్పుర్ గ్రామాల్లో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో ఐఈడీ పేల్చి, కాల్పులు జరిపారు నక్సల్స్. సీఆర్పీఎఫ్ జవానులు దీటుగా స్పందించారు.
Last Updated : Mar 19, 2019, 8:16 PM IST