ఛత్తీస్గఢ్ నారాయణపూర్లో భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన భద్రతా దళాలు వెంటనే ఎదురు కాల్పులు ప్రారంభించాయి. ఈ ఘటనలో ఓ మావోయిస్టు మృతిచెందాడు.
నారాయణపూర్ అసెంబ్లీ స్థానం బస్తర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉంది. ఇక్కడ సుమారు 3 గంటల ప్రాంతంలో పోలింగ్ ముగిసింది. ఎన్నికల విధులు ముగించుకుని తిరిగి బయల్దేరేందుకు సిబ్బంది హెలిప్యాడ్ వద్దకు చేరుకోగానే ఘటన చోటు చేసుకుంది.
జవాన్లపై కాల్పులు జరిపారు మావోలు. అప్రమత్తమైన జవాన్లు తీవ్రస్థాయిలో ప్రతిఘటించారు. భయంతో అక్కడ్నుంచి నక్సల్స్ పారిపోయారు.