చైనాతో సరిహద్దు వివాదం నెలకొన్న నేపథ్యంలో భారత నౌకాదళం మరింత అప్రమత్తమైంది. పొరుగు దేశానికి గట్టి సందేశం పంపేలా.. హిందూ మహాసముద్ర ప్రాంతం(ఐఓఆర్) వెంబడి భారీ స్థాయిలో యుద్ధ నౌకలు, జలాంతర్గాములను మోహరించినట్టు సమాచారం. ఈ మార్పులను చైనాకు కూడా గుర్తించినట్టు తెలుస్తోంది.
చైనా ఎలాంటి దుస్సాహసాలకు పాల్పడకుండా దేశ శక్తిని ప్రదర్శించేందుకు భారత సైన్యం, వైమానిక దళం, నౌకాదళం కలిసిగట్టుగా కృషిచేస్తున్నాయి. వీటితో పాటు దౌత్య, ఆర్థిక చర్యలతో తూర్పు లద్ధాఖ్‌లో చైనా దురాక్రమణను అడ్డుకుంటోంది భారత్.