పుల్వామా ఉగ్రదాడి వెనుక భారత అస్థిరతను కోరుకునే దేశమే ఉందని భారత నావికాదళ చీఫ్ అడ్మిరల్ సునీల్ లంబా అన్నారు. దిల్లీలో జరుగుతున్న ఇండో-పసిఫిక్ రక్షణ రంగ నిపుణుల సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"అస్థిరతే వారి లక్ష్యం"
ఉగ్రదాడుల వెనుక పొరుగు దేశ హస్తముందన్నారు భారత నావికాదశ చీఫ్ అడ్మిరల్ సునీల్ లంబా. దిల్లీలో జరుగుతోన్న భారత్-పసిఫిక్ రక్షణ రంగ సదస్సులో పాక్నుద్దేశించి పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచంలో చాలాదేశాలు తీవ్రవాద రక్కసి బారిన పడుతూనే ఉన్నాయని ఆయన అన్నారు. కొన్ని సంవత్సరాలుగా తీవ్రవాదం రూపుమార్చుకొని కొత్త తరహా దాడులతో విజృంభిస్తోందని లంబా పేర్కొన్నారు. ఉగ్ర భూతానికి భారత్ తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మూడు వారాల క్రితం జమ్ము-కశ్మీర్లో భారత జవాన్ల వాహన శ్రేణిపై తీవ్రవాదులు దాడి చేశారు. ఈ కుట్ర వెనుక భారత దేశ అస్థిరత కోరుకునే దేశం హస్తముంది. కొత్త తరహా దాడుల కోసం ఉగ్ర సంస్థలు ఆధునిక శిక్షణ నిర్వహిస్తోన్నట్లు మా వద్ద నివేదికలున్నాయి.- సునీల్ లంబా,చీఫ్ అడ్మిరల్- భారత నావికాదళం