పంజాబ్ మంత్రిగా నవ్జోత్ సింగ్ సిద్ధూ రాజీనామాపై వివాదం కొనసాగుతోంది. ఇటీవలే తన రాజీనామా లేఖను జూన్ 10న కాంగ్రెస్ అధ్యక్షుడికి సమర్పించినట్లు ప్రకటించారు సిద్ధూ.
'నా రాజీనామా పత్రం ముఖ్యమంత్రికి చేరింది' - నవ్జోత్ సింగ్ సిద్ధూ
నవ్జోత్ సింగ్ సిద్ధూ రాజీనామాపై హైడ్రామా కొనసాగుతోంది. పంజాబ్ మంత్రిగా తన రాజీనామాను ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్కు పంపించినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు సిద్ధూ.
'నా రాజీనామా పత్రం ముఖ్యమంత్రికి చేరింది'
తాజాగా రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్కు సైతం పంపించినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తన రాజీనామా లేఖ ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి చేరిందని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: పంజాబ్: మంత్రి పదవికి సిద్ధూ రాజీనామా