కామోటే సెక్టార్-5లో రద్దీగా ఉన్న కూరగాయల మార్కెట్లో ఇంతటి ఘోరం చోటుచేసుకోవడం స్థానికులను కలచివేసింది. దారి పొడవునా మనుషులున్నా ఖాతరు చేయకుండా పాదచారులపైకి, ద్విచక్రవాహనాలపైకి కారు ఎక్కించేశాడు డ్రైవర్. అదృష్టం బాగుండి కొందరు ప్రాణాలు దక్కించుకున్నా.. సార్థక్ చోప్రా, వైభవ్లు మాత్రం అక్కడిక్కడే కన్ను మూశారు.
లైవ్ వీడియో: మార్కెట్లో కారు బీభత్సం- ఇద్దరు మృతి - కామోటే
కూరగాయల మార్కెట్లో ఓ మందుబాబు చేతిలో శృతి మించిన వేగంతో దూసుకొచ్చిన కారు రెండు నిండు ప్రాణాలను బలిగొంది. క్షణాల్లో 10 మంది రోడ్డుపై ఎగిరిపడ్డ దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి. ఒక్కరి నిర్లక్ష్యం కొన్ని కుటుంబాలకు దుఃఖాన్ని మిగిల్చింది.
మత్తెక్కిన కారు డ్రైవర్... మార్కెట్లో మారణకాండ!
మద్యం సేవించిన కారు డ్రైవర్ దుర్మార్గం సీసీటీవీలో స్పష్టంగా రికార్డయింది. కారు నడిపిన వ్యక్తిని ఖలీం ఇలాతాగా గుర్తించారు పోలీసులు. అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి:అత్త చావుతో షాక్-కోడలి ఆత్మహత్య
Last Updated : Jul 23, 2019, 5:21 PM IST