దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మొత్తం బాధితుల సంఖ్య 25 వేలకు చేరువైంది. అయితే కొత్త కేసుల సంఖ్యలో వృద్ధి 6 శాతానికి తగ్గినట్లు కేంద్రం తెలిపింది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం మధ్య కాలంలో 56 మంది మరణించినట్లు వెల్లడించింది.
భారత్లో 24 గంటల వ్యవధిలో సంభవించిన అత్యధిక మరణాలు ఇవేనని అధికారులు తెలిపారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 779కి చేరినట్లు స్పష్టం చేశారు. ఇప్పటివరకు 5.8 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు.
'మహా' కరోనా
మహారాష్ట్రలో ఒక్క రోజులో ఏకంగా 811 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక రోజులో అత్యధిక కేసులు ఇవే కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 7,628కి చేరింది. శనివారం 22 మంది బాధితులు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 323కి పెరిగింది.
మరోవైపు లాక్డౌన్ కాలంలో 15 మంది పోలీసు అధికారులు సహా మొత్తం 96 మంది పోలీసు సిబ్బందికి కరోనా సోకినట్లు మహారాష్ట్ర అధికారులు తెలిపారు. ముగ్గురు పోలీసు అధికారులు, నలుగురు సిబ్బంది వైరస్ బారి నుంచి కోలుకున్నట్లు స్పష్టం చేశారు.
గుజరాత్లో