తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లైవ్​: 'మహా' క్యాంపు రాజకీయాలు.. కీలక నేతల భేటీలు - maharastra politics latest update news

హోటల్​ హయత్​కు ఎన్సీపీ ఎమ్మెల్యేలు

By

Published : Nov 24, 2019, 8:30 PM IST

Updated : Nov 24, 2019, 11:17 PM IST

22:29 November 24

దేవేంద్ర ఫడణవీస్​తో అజిత్​ పవార్​ భేటీ

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​తో భేటీ అయ్యారు ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నేత అజిత్​ పవార్​. ముంబయిలోని ఫడణవీస్​ నివాసంలో ఇరువురు సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, రేపు సుప్రీం తీర్పు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఎన్సీపీతోనే ఉన్నట్లు కొద్ది గంటల ముందు ప్రకటించారు అజిత్​ పవార్​. భాజపా-ఎన్సీపీ కూటమి అయిదేళ్ల పాటు సుస్థిర పాలన కొనసాగిస్తుందని పేర్కొన్నారు. అంతా మంచే జరుగుతుందని.. కాస్త సహనం అవసరమని పేర్కొంటూ ట్వీట్​ చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో భేటీ కావటం ప్రాధాన్యం సంతరించుకుంది.

20:34 November 24

శరద్​ పవార్​తో సంజయ్​ రౌత్​ భేటీ

మహా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కరసత్తు ముమ్మరం చేశాయి కాంగ్రెస్​-ఎన్సీపీ, శివసేన పార్టీలు. ఎన్సీపీ అధినేత శరద్​ పవార్ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు శివసేన సీనియర్​ నేత సంజయ్​ రౌత్​. సుప్రీం తీర్పు, బల పరీక్ష, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం.

ఎన్సీపీ సీనియర్​ నేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్​ పవార్​ కీలక వ్యాఖ్యలు చేసిన అనంతరం శివసేన-ఎన్సీపీ ముఖ్యనేతలు పలుమార్లు భేటీ కావటం ప్రాధాన్యం సంతరించుకుంది.

20:15 November 24

హోటల్​ హయత్​కు ఎన్సీపీ ఎమ్మెల్యేలు

మహారాష్ట్రలో క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. భాజపా ప్రలోభాలకు తమ పార్టీ ఎమ్మెల్యేలు చిక్కకుండా చర్యలు చేపట్టాయి కాంగ్రెస్​, శివసేన, ఎన్సీపీ. రెనైసెన్స్​​ హోటల్​లో ఉన్న తమ ఎమ్మెల్యేలను హోటల్​ హయత్​కు మార్చింది ఎన్సీపీ. భద్రత కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Last Updated : Nov 24, 2019, 11:17 PM IST

ABOUT THE AUTHOR

...view details