తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ చేరిన 'మహా' రాజకీయం- సోనియాతో పవార్​ భేటీ - మహారాష్ట్ర రాజకీయాలు తాజా వార్తలు

దిల్లీ చేరిన 'మహా' రాజకీయం- సోనియాతో పవార్​ భేటీ

By

Published : Nov 18, 2019, 6:01 PM IST

Updated : Nov 18, 2019, 6:22 PM IST

18:17 November 18

భవిష్యత్​ కార్యాచరణపై చర్చ...

మహారాష్ట్రలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిని ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​... సోనియా గాంధీకి వివరించినట్లు కాంగ్రెస్​ తెలిపింది. భవిష్యత్​ కార్యాచరణపై చర్చించేందుకు ఎన్​సీపీ, కాంగ్రెస్​ నాయకులు ఒకట్రెండు రోజుల్లో దిల్లీలో సమావేశం కానున్నట్లు ఆ పార్టీ ప్రతినిధి వెల్లడించారు. 

18:05 November 18

ముగిసిన భేటీ...

సోనియా గాంధీతో శరద్​ పవార్​ భేటీ ముగిసింది. పవార్ దిల్లీలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. 

17:51 November 18

దిల్లీ చేరిన 'మహా' రాజకీయం- సోనియాతో పవార్​ భేటీ

మహారాష్ట్ర రాజకీయాలు దిల్లీ చేరాయి. ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతోన్న వేళ.. ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​.. కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఆమె నివాసంలో భేటీ అయ్యారు. శివసేనతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై ఇరువురు అగ్రనేతలు చర్చించనున్నట్లు సమాచారం.

ఈ భేటీ అనంతరం.. మహారాష్ట్రలో సర్కారు ఏర్పాటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

Last Updated : Nov 18, 2019, 6:22 PM IST

ABOUT THE AUTHOR

...view details