తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గ్రౌండ్​ జీరోలో డోభాల్​- స్థానికుల్లో భరోసా నింపే యత్నం - National Security Advisor

ఈశాన్య దిల్లీలో అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని చెప్పారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్. హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో పరిస్థితిని ఆయన ప్రత్యక్షంగా సమీక్షించారు.

national-security-advisor-ajit-doval-visted-northeast-delhi
దిల్లీ అల్లర్లు: రంగంలోకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్

By

Published : Feb 26, 2020, 5:10 PM IST

Updated : Mar 2, 2020, 3:48 PM IST

సీఏఏ నిరసనల్లో హింస చెలరేగిన ఈశాన్య దిల్లీలోని మౌజ్​పుర్​ ప్రాంతంలో పరిస్థితిని ప్రత్యక్షంగా సమీక్షించారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్​. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉన్నట్లు చెప్పారు. శాంతియుత వాతావరణం నెలకొందని తెలిపారు. స్థానిక ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, అధికారులు తమ విధులను బాధ్యాతాయుతంగా నిర్వర్విస్తున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు డోభాల్​.

ఈశాన్య దిల్లీలోని వేర్వేరు ప్రాంతాల స్థానికులతో స్వయంగా మాట్లాడారు డోభాల్. "ప్రేమ భావంతో మెలగండి. మనందరిదీ ఒకే దేశం. మనందరం కలిసి బతకాలి. దేశాన్ని కలిసి అభివృద్ధి చేసుకోవాలి" అని ఓ మహిళతో అన్నారు.

దిల్లీ అల్లర్లను అదుపులోకి తెచ్చే బాధ్యతను డోభాల్​కు అప్పగించింది కేంద్రప్రభుత్వం. గత రాత్రి నుంచి ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తూ... పోలీసులు, అధికారులకు తగిన ఆదేశాలు ఇస్తున్నారు.

Last Updated : Mar 2, 2020, 3:48 PM IST

ABOUT THE AUTHOR

...view details