స్వయం సమృద్ధి సాధించాలని దేశ ప్రజలకు కరోనా వైరస్ నొక్కి చెప్పిందని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గ్రామాలు, జిల్లాలు, ప్రాంతాల వారిగా స్వయం సమృద్ధి సాధించడం అత్యంత అవసరమన్నారు. నేడు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు మోదీ.
'రెండు అడుగుల దూరంతో వైరస్‌ను పారదోలుదాం' అనే నినాదంతో ప్రజలను చైతన్యం చేయాలని సర్పంచ్‌లకు పిలుపునిచ్చారు మోదీ. ప్రజల భాగస్వామ్యంతో కరోనా వైరస్‌పై భారత్ పోరాడుతున్న విధానానికి ప్రపంచదేశాలు ఆకర్షితమయ్యాయని ఉద్ఘాటించారు. లాక్డౌన్ నిబంధనలను పాటించడం పట్ల ప్రజలకు అభినందనలు తెలిపారు. పరిమిత వనరులు వంటి అనేక అవాంతరాలు ఉన్నప్పటికీ దేశాన్ని కాపాడే యజ్ఞంలో ప్రజలంతా ఒక్కటిగా ముందుకు సాగుతున్నారన్నారు.
వైరస్ నియంత్రణలో గ్రామాల అభివృద్ధికి సంబంధించి తమ అభిప్రాయాలు, ఆలోచనలను ప్రధానితో పంచుకున్నారు సర్పంచులు. గ్రామ ప్రజాప్రతినిధులు వారు చేపడుతున్న చర్యలను వివరించగా.. వారి కృషిని అభినందించారు మోదీ.
గ్రామ పురోగతి సమాచారం కోసం..