జాతీయ వైద్య కమిషన్ బిల్లు-2019ను లోక్సభ ఆమోదించింది. ప్రస్తుత భారత వైద్య మండలిని రద్దు చేసి దాని స్థానంలో కొత్త విభాగాన్ని ఏర్పాటును ఈ బిల్లును తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ బిల్లును విపక్షాలు వ్యతిరేకించినా దిగువ సభలో నెగ్గింది.
భారతీయ వైద్య మండలి చట్టం-1956ను రద్దు చేసే దిశగా ఈ బిల్లును ప్రతిపాదిస్తోంది. ఎంసీఐ నియంత్రణలోని వైద్య కళాశాలలు లోపభూయిష్టంగా ఉన్నాయని.. అవినీతిమయం అయ్యాయని బిల్లు పేర్కొంటోంది.