తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్ విభజన దేశ భద్రతకే ముప్పు: రాహుల్​

మోదీ సర్కార్​ జమ్ముకశ్మీర్​ను ఏకపక్షంగా విభజించిందని కాంగ్రెస్ నేత రాహుల్​గాంధీ ఆరోపించారు. ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని, విభజన జాతీయ భద్రతకే ముప్పు తెస్తుందని ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

కశ్మీర్ విభజన దేశ సమగ్రతకే ముప్పు: రాహుల్​గాంధీ

By

Published : Aug 6, 2019, 1:39 PM IST

Updated : Aug 6, 2019, 1:57 PM IST

కేంద్రప్రభుత్వం జమ్ముకశ్మీర్​ను విభజించడం, ఆర్టికల్ 370 రద్దు చేయడంపై కాంగ్రెస్ నేత రాహుల్​గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

"జమ్ముకశ్మీర్​ను కేంద్రప్రభుత్వం ఏకపక్షంగా విభజించింది. ప్రజాప్రతినిధులను కారాగారంలో పెట్టడం ద్వారా, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం ద్వారా జాతీయ సమైక్యత పెరగదు. దేశమంటే ప్రజలు. ఇష్టారీతిన విభజించడానికి దేశం ప్లాట్లు కాదు. (మోదీ సర్కార్​) అధికార దుర్వినియోగానికి పాల్పడడం జాతీయ భద్రతకే ముప్పు తెస్తుంది."

-రాహుల్​గాంధీ, కాంగ్రెస్ నేత

కశ్మీర్ విభజన దేశ సమగ్రతకే ముప్పు: రాహుల్​గాంధీ

కశ్మీర్ విభజన

కేంద్ర ప్రభుత్వం సోమవారం రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక హోదా, హక్కులు కల్పిస్తున్న ఆర్టికల్​ 370, ఆర్టికల్ 35-ఎ లను రద్దు చేసింది. జమ్ముకశ్మీర్​ రాష్ట్రాన్ని నూతనంగా రెండు కేంద్రపాలిత ప్రాంతాలు జమ్ముకశ్మీర్​, లద్ధాఖ్​లుగా మార్చింది.

ఇదీ చూడండి: చైనాకు 'కరెన్సీ మానిపులేటర్'​ ముద్ర వేసిన అమెరికా

Last Updated : Aug 6, 2019, 1:57 PM IST

ABOUT THE AUTHOR

...view details