కరోనాపై పోరులో భాగంగా తొలి దేశీయ యాంటీబాడీ డిటెక్షన్ కిట్‌ను అభివృద్ధి చేసింది పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ). కరోనా వ్యాప్తిపై నిఘా ఉంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.
2.5 గంటల్లో 90 నమూనాలను కలిపి పరీక్షించే సామర్థ్యం ఈ కిట్ సొంతమని పేర్కొన్నారు హర్షవర్ధన్. ఆరోగ్య నిపుణులు మరింత వేగంగా పనిచేయడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. ఈ కిట్ అత్యంత సున్నితం, ఖచ్చితమైనదని అభివర్ణించారు.