'స్మార్ట్ ఇండియా హ్యకథాన్-2020' కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ శతాబ్దం యువత ఆకాంక్షలకు అనుగుణంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని రూపొందించినట్లు విద్యార్థులకు తెలిపారు. విద్యావ్యవస్థను అత్యంత ఆధునికీకరించే ప్రయత్నాల్లో భాగంగానే మార్పులు చేపట్టినట్లు పేర్కొన్నారు.
'యువత ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త విద్యావిధానం' - pm modi latest news
21వ శతాబ్దపు యువత ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకునే నూతన జాతీయ విద్యా విధానాన్ని రూపొందించినట్లు చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. విద్యా వ్యవస్థను ఆధునికీకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. 'స్మార్ట్ ఇండియా హ్యాకథాన్-2020' కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ప్రసంగించారు మోదీ.
!['యువత ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త విద్యావిధానం' National Education Policy 2020 announced recently has been framed keeping in mind the aspirations of the youth of 21st century of our countr](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8259605-53-8259605-1596285729104.jpg)
'యువత ఆకాంక్షలకు అనుగుణంగా నూతన విద్యావిధానం'
21వ శతాబ్దాన్ని జ్ఞాన యుగంగా అభివర్ణించారు మోదీ. అభ్యాసం, పరిశోధన, ఆవిష్కరణలపై మరింత దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.