దేశవ్యాప్తంగా ధైర్య సాహసాలు కనబర్చిన 49మంది బాలలకు రాష్ట్రపతి భవన్లో పురస్కారాలు ప్రదానం చేశారు రామ్‌నాథ్ కోవింద్. బాల శక్తి పురస్కారాల పేరుతో ఇచ్చే ఈ అవార్డులను 2020 సంవత్సరానికి గానూ 49 మంది బాలురకు అందజేశారు.
49మంది బాలలకు 'బాల శక్తి' పురస్కారాలు - national bravery awards
ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాల(జాతీయ సాహస అవార్డు) ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్లో జరిగింది. గతేడాది ధైర్య సాహసాలు కనబర్చిన 49 మంది బాలురకు అవార్డులను ప్రదానం చేశారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.
22మంది బాలలకు జాతీయ సాహస పురస్కారాలు
ఈ అవార్డుకు ఎంపికైన విద్యార్థుల పేర్లను మంగళవారం ప్రకటించింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ చైల్డ్ వెల్ఫేర్(ఐసీసీడబ్ల్యూ). ఈ పురస్కారానికి ఎంపికైన వారిలో కశ్మీర్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. ముగ్గురు స్నేహితులను కాపాడేందుకు తన ప్రాణాలను ఫణంగా పెట్టిన కేరళ కోజీకోడ్‌కు చెందిన మహమ్మద్ ముసిన్కు మరణానంతరం ఈ అవార్డు ప్రకటించారు.
Last Updated : Feb 17, 2020, 11:34 PM IST