జాతీయ ఆదివాసీ నృత్యోత్సవాలు ఛత్తీస్‌గఢ్ రాయ్‌పుర్‌లో ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు పలు రాష్ట్రాలు, విదేశీ ప్రముఖులు హాజరయ్యారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పడమే లక్ష్యంగా నేటి నుంచి రెండు రోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
గిరిజన పండుగలో ప్రత్యేక ఆకర్షణగా 'రాహుల్ నృత్యం' - ఆదివాసీల పండుగలో రాహుల్ నృత్యం
ఛత్తీస్‌గఢ్ రాయ్‌పుర్‌లో జాతీయ గిరిజన నృత్యోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సరదాగా డోలు పట్టి సంప్రదాయ నృత్యం చేశారు. ఈ వేడుకల్లో దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
గిరిజన పండుగలో గజ్జె కట్టిన రాహుల్ గాంధీ
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఆదివాసీలతో కాలు కదిపారు. డోలు వాయిస్తూ ఆడిపాడారు.
2,500 మందికిపైగా నృత్య కళాకారులు ఈ ఉత్సవానికి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 29న రాత్రి ఏడు గంటల నుంచి 9 గంటల వరకు ముగింపు కార్యక్రమం ఉంటుంది. మొదటి స్థానంలో నిలిచిన బృందానికి రూ.20 లక్షలు, రెండో స్థానంలో నిలిచిన బృందానికి రూ.12 లక్షలు, మూడో స్థానంలో నిలిచిన బృందానికి రూ.8 లక్షలు బహుమతిగా అందజేస్తారు.