తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కాంగ్రెస్​ ప్రాసెసర్​ ఓకే.. సాఫ్ట్​వేరే పాడైంది' - BENGALURU

కాంగ్రెస్​పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్రమోదీ. రక్షణ, కశ్మీర్​ అంశంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలోని హామీలను ప్రస్తావిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సైన్యాన్ని అభద్రతా భావంలో పడేసే వారికి సరైన బుద్ధి చెప్పాలని కర్ణాటక బెంగళూరు బహిరంగ సభలో పిలుపునిచ్చారు.

నరేంద్రమోదీ

By

Published : Apr 13, 2019, 11:37 PM IST

60 ఏళ్ల పాలనలో దేశాన్ని కాంగ్రెస్​ పూర్తిగా దోచుకుందని ఆరోపించారు ప్రధాని నరేంద్రమోదీ. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలపై విమర్శలు వర్షం కురిపించారు.

జేడీఎస్ నేతలపై జరిగిన ఐటీ దాడులను ప్రస్తావిస్తూ.. "అవినీతి చేసింది ప్రధాని అయినా, ముఖ్యమంత్రి అయినా శిక్షించాలా వద్దా?" అని మోదీ ప్రశ్నించారు.

నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

"ఏఎఫ్​ఎస్​పీఏ.. (సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం)తో దేశంలోని జవాన్లు, రక్షణ బలగాలకు ప్రత్యేక అధికారాలు లభిస్తాయి. వాళ్ల (కాంగ్రెస్) మేనిఫెస్టోలో ఏం చెప్పారు. వాళ్లు అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తారట. మీకు అనిపిస్తుంది కాబోలు.. కాంగ్రెస్ ప్రాసెసర్​ బాగానే ఉండొచ్చు.. కానీ సాఫ్ట్​వేర్​ పాడయింది. దీనికి శిక్ష ఏంటంటే.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు ధరావతు(డిపాజిట్​) కూడా రావొద్దు."

- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ఇదీ చూడండి: అంబానీకి ఫ్రాన్స్​లో పన్ను మినహాయింపు !

ABOUT THE AUTHOR

...view details