సరిహద్దుల్లో శాంతి భద్రతల పరిరక్షణ సహా పలు కీలక ద్వైపాక్షిక అంశాలు చర్చించటానికి మయన్మార్ అగ్రనేత, స్టేట్ కౌన్సెలర్ ఆంగ్ శాన్ సూచీతో భారత సైన్యాధిపతి జనరల్ ఎం.ఎం. నరవణె, విదేశీ వ్యవహారాల కార్యదర్శి హర్ష్వర్ధన్ శృంగ్లా సోమవారం సమావేశమయ్యారు.
మయన్మార్ అగ్రనేతతో భారత సైన్యాధిపతి భేటీ - భారత సైన్యాధిపతి
మయన్మార్ అగ్రనేత, స్టేట్ కౌన్సెలర్ ఆంగ్ శాన్ సూచీతో భారత సైన్యాధిపతి జనరల్ ఎం.ఎం. నరవణె, విదేశీ వ్యవహారాల కార్యదర్శి హర్ష్వర్ధన్ శృంగ్లా సోమవారం సమావేశమయ్యారు. సరిహద్దులో శాంతి భద్రతలు సహా పలు అంశాలపై చర్చలు జరిపారు.
మయన్మార్ అగ్రనేతతో భారత సైన్యాధిపతి భేటీ
పరస్పర ప్రయోజనాలకు విఘాతం కలిగించే విద్రోహ శక్తులకు తమ భూభాగాల్లో ఆశ్రయం కల్పించకూడదన్న అంగీకారాన్ని ఇరు దేశాలు తాజా సమావేశంలో పునరుద్ఘాటించాయి. మయన్మార్ రక్షణ సేవల కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ మిన్ ఆంగ్ లియాంగ్తోనూ నరవణె, శృంగ్లా భేటీ అయ్యారు.