తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అయోధ్య ముగిసిన అధ్యాయం.. రివ్యూ పిటిషన్​ ఎందుకు?'

అయోధ్య రామమందిరం- బాబ్రీ మసీదు కేసులో రివ్యూ పిటిషన్​ దాఖలుపై మైనార్టీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్​ అబ్బాస్​ నఖ్వీ స్పందించారు. తీర్పుపై సమీక్ష కోరాలన్న అఖిల భారత ముస్లిం లా బోర్డ్​, జమైత్​-ఉలేమా-ఏ-హింద్​ నిర్ణయాన్ని ఆక్షేపించారు.

Naqvi slams AIMPLB, Jamiat for Ayodhya decision review bid, says matter closed for people
'అయోధ్య ముగిసిన అధ్యాయం.. రివ్యూ పిటిషన్​ ఎందుకు?'

By

Published : Dec 1, 2019, 1:59 PM IST

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అనుమతిస్తూ సుప్రీం కోర్టు.. ఆ కేసుకు శాశ్వత పరిష్కారం చూపిందని మైనార్టీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్​ అబ్బాస్​ నఖ్వీ అభిప్రాయపడ్డారు. రివ్యూ పిటిషన్​కు వెళ్లాలన్న అఖిల భారత ముస్లిం లా బోర్డ్​, జమైత్​-ఉలేమా-ఏ-హింద్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. పీటీఐకి ఇచ్చిన ముఖాముఖిలో పలు విషయాలు ప్రస్తావించారు మంత్రి.

"అయోధ్య విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమాజంలోని అన్ని వర్గాలు స్వాగతించాయి, గౌరవించాయి. ఈ తీర్పుతో దేశంలో ఐక్యత మరింత పెరిగిందన్న వాస్తవాన్ని కొంతమంది గ్రహించకపోవడం బాధాకరం. వారు సమాజంలో విభజన, ఘర్షణ వాతావరణం సృష్టించేందుకు ప్రయతిస్తున్నారు. ఇది ఎవరూ అంగీకరించరు. అయోధ్య కేసులో శాశ్వత పరిష్కారం దక్కిందని అన్ని వర్గాలు భావిస్తున్నాయి."
-ముఖ్తార్​ అబ్బాస్​ నఖ్వీ, మైనార్టీ వ్యవహారాల మంత్రి

అయోధ్య వ్యవహారంలో ముస్లిం పర్సనల్​ లా బోర్డ్​ తీరు పట్ల నఖ్వీ అసంతృప్తి వ్యక్తం చేశారు. తీర్పు వచ్చిన రోజు స్వాగతించిన బోర్డు... తర్వాత రివ్యూకు వెళ్తామనడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.

ఈ అంశం పట్ల వారికి (ఎఐఎమ్​పీఎల్​బీ, జమైత్​) అంత శ్రద్ధ ఉంటే.. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటారా అని కోర్టు అడిగినప్పుడు ఎందుకు అంగీకరించలేదు? తీర్పునకు మందు మా ఇంట్లో అన్ని వర్గాల పెద్దలతో చర్చ జరిగిన సమయంలో సుప్రీం నిర్ణయాన్ని స్వాగతిస్తామని అందరూ ముక్తకంఠంతో చెప్పారు. తీర్పు వచ్చిన వెంటనే స్వాగతించిన వారికి.. రివ్యూ పిటిషన్​ దాఖలు చేయాలనే ఆలోచన, జ్ఞానం రావడానికి కారణమేంటో నాకు తెలియదు? అసలు ఎందుకు నిర్ణయం మార్చుకున్నారు?
-ముఖ్తార్​ అబ్బాస్​ నఖ్వీ, మైనార్టీ వ్యవహారాల మంత్రి

ప్రస్తుత పరిణామాలు అయోధ్య వ్యవహారంలో మరో అధ్యాయానికి తెర లేపుతాయా అన్న ప్రశ్నకు నఖ్వీ సమాధానమిస్తూ... "మళ్లీ ఈ అంశాన్ని వారి ఇళ్లలోనే తెరపైకి తేవాలి. ఎందుకంటే సమాజం, దేశం విషయానికి వస్తే... అయోధ్య ముగిసిన అధ్యాయం" అన్నారు నఖ్వీ.

చారిత్రక తీర్పు...

అయోధ్యలోని వివాదాస్పద భూమిలో రామమందిర నిర్మాణానికి అనుమతిస్తూ సుప్రీం కోర్టు నవంబర్​ 9న చారిత్రక తీర్పు వెలువరించింది. మసీదు నిర్మాణానికి 5 ఎకరాల ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ తీర్పును మొదట స్వాగతించినా.. మళ్లీ డిసెంబర్​ 9లోపు రివ్యూ పిటిషన్​ దాఖలు చేయనున్నట్లు అఖిల భారత ముస్లిం పర్సనల్​ లా బోర్డ్​ ప్రకటించింది. డిసెంబర్​ 3 లేదా 4న పునర్విచారణ వ్యాజ్యం దాఖలు చేస్తామని జమైత్​-ఉలేమా-ఏ-హింద్​ స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details