తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గోద్రా అల్లర్ల కేసులో మోదీకి నానావతి కమిషన్​ క్లీన్​ చిట్

godhra-train-burning-riots-case
గోద్రా అల్లర్ల కేసులో మోదీకి నానావతి కమిషన్​ క్లీన్​ చిట్

By

Published : Dec 11, 2019, 11:59 AM IST

Updated : Dec 11, 2019, 12:59 PM IST

12:27 December 11

గోద్రా అల్లర్ల కేసులో మోదీకి నానావతి కమిషన్​ క్లీన్​ చిట్

2002 గుజరాత్​ అల్లర్లపై విచారణ జరిపిన నానావతి-మెహతా కమిషన్​ తుది నివేదిక... ఆ శాసనసభ ముందుకు వచ్చింది. ఈ కమిషన్​ ఐదేళ్ల క్రితమే ప్రభుత్వానికి నివేదికను అందించగా.. తాజాగా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు రాష్ట్ర హోం మంత్రి ప్రదీప్​ సింగ్​ జడేజా.

గుజరాత్​ అల్లర్లలో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి, మంత్రి వర్గ సహచరులకు నానావతి కమిషన్​ క్లీన్​ చిట్​ ఇచ్చింది. అల్లర్లు ఉద్దేశపూర్వకంగా జరిపించినవి కాదని స్పష్టం చేసింది. 

పోలీసుల వైఫల్యం..

అయితే.. ఈ ఘటనలో పోలీసుల్ని తప్పుబట్టింది కమిషన్​. అల్లర్లను నియంత్రించడంలో పోలీసుల అసమర్థత కనిపించిందని పేర్కొంది. తప్పనిసరి సమయంలో.. పోలీసు సిబ్బంది వేగంగా స్పందించలేకపోయారని, అల్లర్లను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేయలేదని చురకలంటించింది. అసమర్థత చూపిన పోలీసు అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కమిషన్​ సిఫారసు చేసింది. 

గోద్రా ఘటన అనంతరం.. 2002లో జరిగిన గుజరాత్​ అల్లర్లలో 1000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 

గోద్రా అల్లర్లు

2002లో గోద్రా రైల్వే స్టేషన్​ సమీపంలో సబర్మతి ఎక్స్​ప్రెస్​లోని రెండు బోగీలు దగ్ధమై.. 59 మంది కరసేవకులు ప్రాణాలు కోల్పోయారు. తదనంతరం.. గుజరాత్​లో మత ఘర్షణలు, అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు... అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ నానావతి కమిషన్​ను నియమించారు. 

11:55 December 11

గోద్రా అల్లర్ల కేసులో మోదీకి నానావతి కమిషన్​ క్లీన్​ చిట్

గోద్రా అల్లర్ల కేసులో అప్పటి నరేంద్ర మోదీ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వానికి క్లీన్​ చిట్ ఇచ్చింది నానావతి-మెహతా కమిషన్​. ఈమేరకు ఆ రాష్ట్ర శాసనసభకు నివేదిక సమర్పించింది. 
 

Last Updated : Dec 11, 2019, 12:59 PM IST

ABOUT THE AUTHOR

...view details