తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పటోలేకు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు - nana patole latest news

మహారాష్ట్ర కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడిగా నానా పటోలేను నియమించింది అదిష్ఠానం. మరో ఆరుగురు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులను నియమించారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ.

Nana Patole appointed president of Maharashtra congress
పటోలేకు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి పగ్గాలు

By

Published : Feb 5, 2021, 4:22 PM IST

నానా పటోలేను మహారాష్ట్ర కాంగ్రెస్​ అధ్యక్షుడిగా నియమించింది పార్టీ అధిష్ఠానం. ఆ పదవి నుంచి బాబా సాహెబ్​ తోరట్​ను తొలిగించిన కాంగ్రెస్​.. పార్టీ పగ్గాలను పటోలేకు అప్పగించింది. ఈ కారణంగానే స్పీకరు పదవికి ఆయన రాజీనామా చేశారు. ఉపాధ్యక్షుడిగా మాజీ రాజ్యసభ సభ్యుడు ఉస్సేన్​ దల్​వాయిని నియమించిన కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. ఆరుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమించారు.

గతంలో కాంగ్రెస్‌ నుంచి భాజపాలో చేరిన పటోలే 2014లో భండారా-గోండియా నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2017లో కమలం పార్టీకి గుడ్‌ బై చెప్పి 2018లో తిరిగి మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చారు. 2019లో మహారాష్ట్రలోని శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ సారథ్యంలో ఏర్పాటైన మహావికాస్‌ అఘాడీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్‌గా ఎన్నికయ్యారు.

ఇదీ చూడండి:జైపుర్​లో అన్నదాతల ట్రాక్టర్​ ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details